గతంలో దాసరి, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరుల వద్ద వందకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన ధర్మ ఇప్పుడు మెగా ఫోన్ పట్టారు. రత్న మేఘన క్రియేషన్స్ పతాకంపై దర్శక, నిర్మాతగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘సంహారం’. ఆదిత్య, కవిత మహ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది.
దర్శక, నిర్మాత ధర్మ మాట్లాదుతూ, ‘ఇదొక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఒక అమ్మాయి తనకు, తన అక్కయ్యకి అనుకోని ఘటనలు ఎదురైనపుడు, తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో దుష్టులను ఎలా ఎదుర్కొంది అనే పాయింట్‌తో ఈ సినిమా తీశాను. తమను తాము కాపాడుకునేందుకు అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం అని ఈ చిత్రంలో చూపించాం. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరాం ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడంతో పాటు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుం దనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.