ఉత్తమ్ కి బయోడేటాను అందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-  నెల్లికుదురు
వరంగల్ ఎంపీ అభ్యర్థికి అవకాశం నాకు కల్పించి సహకరించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి తన బయోడేటాను అందించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నెల్లికుదురు మాజీ జడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కోరినట్టు తెలిపారు బుధవారం హైదరాబాదులోని సచివాలయంలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసేందుకు తన వంతు కృషి 100% చేశారని అన్నారు అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రతి చిన్న పెద్ద కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు మరియు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీని కష్టసుఖాల్లో కాపాడుకుంటూ వచ్చామని అన్నారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో పోటీ చేయబోతున్నానని నాకు మీరు అండదండలు అందించి ఎంపీ సీటు ఇప్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.  వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు గ్రామ అధ్యక్షులు రత్నపురం యాకయ్య మండల వర్కింగ్ అధ్యక్షులు కుమ్మరి కుంట్ల మౌనేందర్ మాజీ ఎంపీటీసీ గుగులోతు నరేష్ కిసాన్ మండల అధ్యక్షులు సలుగు పూర్ణచందర్ ఆకుల కొరయ్య సట్ల యాకయ్య  తదితరులు పాల్గొన్నారు.