
– భారీ మెజారిటీతో హరీశ్ రావుని గెలిపించాలి
నవతెలంగాణ – చిన్నకోడూరు: సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నికల ముందు, తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే నాయకుడు మంత్రి హరీశ్ రావు ఒక్కరేననీ భారాస రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల, గోనెపల్లి గ్రామాలలో హరీశ్ రావు పక్షాన సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన నాయకుడు మంత్రి హరీశ్ రావు అని, ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికలప్పుడు మాత్రమే కన్పిస్తారని అన్నారు. అధికారంలోకి రాగానే సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా రూ.3వేలు, ప్రభుత్వ సీలింగ్ భూములకు పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా బిపిటి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. రామునిపట్ల గ్రామంలోని సుతారి, సెంట్రింగ్ సంఘం, డబుల్ బెడ్ రూం లబ్దిదారులు హరీశ్ రావుకి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్ పర్సన్ కొండం వనిత, భారాస మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆకుల సుశీల, డిసిసిబి డైరెక్టర్ రామచంద్రం, గ్రామ సర్పంచ్లు జేరిపోతుల శ్రీనివాస్, స్వరూప ఎల్లాగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాముని ఉమెష్ చంద్ర, పిఏసిఎస్ చైర్మన్లు సదానందం, కనకరాజు, ఎంపిటిసి బండి పద్మ మల్లేశం, సీనియర్ నాయకుడు ముక్కిస సత్యనారాయణ రెడ్డి, మహిళా నేతలు సరోజన, శివ్వమ్మ, కనకవ్వ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.