ఎన్టీఆర్‌ తర్వాత అభివృద్ధి చేసింది కేసీఆరే

– దేశంలో నీళ్లు లెవ్‌..తెలంగాణలో కేసీఆర్‌ తోనే పుష్కలంగా నీళ్లు
– గుండాల మండలాన్ని దత్తత తీసుకుంటా
– రూ.14.74 కోట్లతో సుద్దాల బ్రిడ్జి ప్రారంభం
నవతెలంగాణ-గుండాల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కొంత అభివద్ధి జరిగిందని, ఆ తర్వాత ఇప్పుడు సీఎంకేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ అన్ని విధాలా అభివద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో సీఎంలను, మంత్రులనుచూశానని, తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత అభివద్ధి ఎలా ఎందో ప్రజలు గమనించాలని, ఇప్పుడు కండ్ల ముందు కనిపిస్తున్న అభివద్ధి అంతా సీఎం కేసీఆర్‌ కషితోనే సాధ్యమైందని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గుండాల మండల కేంద్రంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధిశాఖ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో పాటు ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లు కాంగ్రెస్‌ నాశనం చేసిందని, ఇప్పుడు బీజేపీ నాశనం చేస్తోందని, ఆ రెండు పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతోనే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. నేడు ఏపీలోనే కరెంట్‌ లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ ఇవ్వడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.లక్ష ఇచ్చే కల్యాణలక్ష్మీ లేదని, రూ.3 వేలు, 2 వేలు పింఛన్లు లేవని, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలేవీ లేవన్నారు. గుండాల మండలం కరువు ప్రాంతమని, దేవాదుల ద్వారా ముందు గుండాల మండలానికి నీళ్లు వదిలిన తర్వాతే నా నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళుతున్నానని, మా చెల్లె సునీత పై ఉన్న ప్రేమతోనే గుండాల కు ముందుగా నీళ్లు ఇస్తున్నామన్నారు. నా నియోజకవర్గం పక్క మండలమైన గుండాల మండలాన్ని తాను దత్తత తీసుకుంటానని మంత్రి ప్రకటించారు. మా చెల్లె సునీత గుండాల మండలానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, మా చెల్లెలు సునీతను మీరంతా కాపాడుకోవాలని కోరారు. గుండాల మండలానికి ఏడాదికి వివిధ పథకాల కింద ప్రజలకు రూ.10 కోట్లకు పైగా ఇస్తున్నామని తెలిపారు. నూనెగూడెం వద్ద బ్రిడ్జి, మరిపడిగ గంగాపురం బీటీ రోడ్డు, మరిపడిగలో బ్రిడ్జి, తుర్కలశాపురం, బండకొత్తపల్లి వద్ద బిక్కేరు వాగులో బ్రిడ్జి, మోదుగుబాచిగూడెం బీటీ రోడ్డు, గ్రామపంచాయతీలకు కొత్త భవనాల కోసం ఎమ్మెల్యే సునీత మంత్రిని కోరగా వాటిపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే మండలాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించి ముగించారు.
గోదావరి జలాలు ముందుగా వచ్చింది గుండాలకే…
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి
గోదావరి జలాలు ముందుగా గుండాల మండలానికే వచ్చాయని, కరువుతో అల్లాడిన గుండాలకు గోదావరిజలాలు తీసుకవచ్చి చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యేగొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి అన్నారు. కరువుతో అల్లాడుతున్న గుండాల మండల పరిస్థితి తెలిసినమంత్రి దయాకర్‌ అన్నతో కొట్లాడి ఈ ప్రాంతానికి ముందుగానే గోదావరి జలాలు తేవడంతో సాగు,తాగునీటి కొరత తీరిందన్నారు. గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో కలపడంతో మండల ప్రజలకు తనను దూరం చేస్తే దయాకరన్న దష్టికి తీసుకెళ్లడంతో ధైర్యం చెప్పారని, తిరిగి యాదాద్రి జిల్లాలోకలవడానికి దయాకరన్న కషి ఎంతో ఉందని, గుండాలను యాదాద్రిలో కలపడం పట్ల కతజ్ఞతలుతెలిపారు. తొలుత బోనాలు, బతుకమ్మలు డప్పుచప్పుళ్లతో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి వాసవి గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బిక్కేరు వాగుపై సుద్దాల-పల్లెపహాడ్‌ గ్రామాల మధ్య రూ.14.74 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, చెక్‌ డ్యాంను మంత్రి దయాకర్‌ రావు ప్రారంభించారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ రూ.1.33 కోట్ల చెక్కు, ఆలేరు నియోజకవర్గ స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్త్రీనిధి నుంచి రూ.5.70 కోట్ల చెక్కను మహిళలకు అందజేశారు. ఈ సభలో జెడ్పీచైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌్‌ కంచర్ల రామకష్ణారెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, జడ్పీ సీఈవో కష్ణారెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి, ఎంపీపీతాండ్ర అమరావతి, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీ, జడ్ఫీ కోఆప్షన్‌ మెంబర్‌ ఎండి.ఖలీల్‌, వైస్‌ ఎంపీపీమహేశ్వరం మహేందర్‌ రెడ్డి, మార్కెట్‌ వైస్‌ ఎంపీపీ మూగల శ్రీనివాస్‌, సర్పంచ్‌ చిందం వరలక్ష్మీ, ఎంపీటీసీకుంచాల సుశీల, ఎంపీడీవో జి.శ్రీనివాసులు, తహసీల్దార్‌ జి.జ్యోతి, మాజీ జడ్పీటీసీలు గడ్డమీది పాండరి, మందడి రామకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.