నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్ట్ నుండి గురువారం రోజు జుక్కల్ ఎమ్మెలే హన్మంత్ షిండే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మూడు గేట్లను పూజలు నిర్వహించి దిగువన నీటీని విడుదల చేసారని ప్రాజేక్ట్ అధికారులు తెలిపారు. ఈ సంధర్భంగా ఎమ్మెలే హన్మంత్ షిండే మాట్లాడుతు నీటి ప్రావాహ ప్రాంత గ్రామాల పశువుల కాపరులతో పాటు రైతులు ఎవరు కూడా వెళ్ల వద్దని, బారీగా వర్షాలు పడుతుండటంతో జాగ్రత్త వహించాలని అన్నారు. వర్షాలు అలస్యంగా పడటంతో గతేడాది జూన్ లోనే నీటిని విడుదల చేసామని , ఒక నెల లేట్ గా ప్రాజేక్ట్ నిండిందని, ఇక ఖరీఫ్, రబి పంటలకు ఆయకట్టు రైతులకు బరోసా కల్గిందని సంతోషం వ్యక్తం చేసారు. ప్రాజేక్ట్ ఏఈ రవిశంకర్ మాట్లాడుతు ప్రాజేక్ట్ పూర్తీ స్థాయి నీటీ మట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457:50 మీటర్లు నీరు ఉందని ఇన్ ఫ్లో 6450 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 9684 క్యూసెక్కులు దిగువకు మూడు గేట్ల ద్వారా గేట్లు ఎత్తి వదిలివేయడం జర్గుతున్నదని, ప్రాజేక్ట్ నీటి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పడికే ప్రచారం చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్ , మండల,గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ప్రాజేక్ట్ అధికారులు తదితరులు పాల్గోన్నారు.

