నాన్న వస్తున్నాడంటే భయమేసేది

– లైంగికంగా వేధించేవాడు.. : ఢిల్లీ మహిళా చీఫ్‌
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని అన్నారు. తనను చిన్నతనంలో తన నాన్న లైంగికంగా వేధించేవాడని, ఆయన ఇంటికి వస్తున్నాడంటేనే భయపడిపోయేదాన్నని, మంచం కింద దాక్కునే దాన్నని పేర్కొన్నారు. దీంతో ప్రతిరాత్రి ఆడవారికి ఎలా సహాయం చేయాలని, పిల్లలను వేధించే పురుషులకు ఎలా గుణపాఠం చెప్పాలని ప్రతి రాత్రి ప్లాన్‌ చేసేదాన్నని అన్నారు. తాను నాలుగవ తరగతి చదివే వరకు తన తండ్రితో కలిసి జీవించానని, ఈ విధంగా చాలసార్లు జరిగిందని అన్నారు.