ఆర్భాటంగా ఏర్పాటు చేశారు.. నామమాత్రంగా వెలిగించారు

నవతెలంగాణ – మిరు దొడ్డి 
ఆర్భాటంగా ఏర్పాటు చేశారు.. నామమాత్రంగా వెలిగించారు. ఇంకేముంది మళ్లీ ఒక్క రోజుకే రోడ్డుపై జిగేల్మనిపించిన వెలుగులు కనుమరుగయ్యాయి. 0 మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రెండు రోజుల క్రితం నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై లైట్లను ప్రారంభించారు. మిట్ట మధ్యాహ్నం ప్రారంభించిన లైట్లు ఆరోజు మాత్రం జిగేల్మన్నాయి. ఇక ఒక రోజు తర్వాత వాటికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో మళ్లీ మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు చీకట్లు అలుముకున్నాయి. ఒక్కరోజు ఆర్భాటం చేసి ఇలా వదిలేయడం పై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభించిన పనులు ఒక్క రోజుకే గాలి వదిలేసారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల్లో విద్యుత్ సమస్య ఎలా ఉందో తెలుస్తుంది దానికి తోడు నేడు సర్పంచులు పదవి కాలం ముగించడంతో గ్రామాల్లో ఎక్కడ చూసిన చీకటిమాంగానే వీధిలోని దర్శమిస్తున్నాయి. అధికారుల పాలన రావడంతో అధికారులు కూడా ప్రజాప్రతిల్లాగా వ్యవహరిస్తారా లేదా ప్రజలకు ఏదైనా సౌకర్యాలు కల్పిస్తారో లేదని ప్రజలు చూస్తున్నారు. ఎవరు చేసినా ప్రజల పరిస్థితి ఒకేలాగా ఉందంటున్న మిరుదొడ్డి గ్రామస్తులు.