సీపీ ని మర్యాద పూర్వకంగా కలిసిన తొగుట సీఐ

నవతెలంగాణ – తొగుట
సీపీ ని మర్యాద పూర్వకంగా కలిసామని తొగుట సిఐ ఎస్కె. లతీఫ్ తెలిపారు. సోమవారం తొగుట నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్క్ లతీఫ్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను కలసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీ అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని సూచించారని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని అన్నారు. గంజా యి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు.