ఇది సరైన నిర్ణయం కోచ్‌గా ద్రవిడ్‌

ఇది సరైన నిర్ణయం కోచ్‌గా ద్రవిడ్‌– కొనసాగింపుపై గంభీర్‌
న్యూఢిల్లీ : టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్టు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్వాగతించాడు. త్వరలో టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న వేళ ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ పరాజయం పాలైనప్పటికీ.. జట్టు అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ద్రవిడ్‌పై బీసీసీఐ విశ్వాసముంచి కోచ్‌గా అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌లను కూడా పొడిగించింది. ‘త్వరలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న ఈ తరుణంలో మొత్తం కోచింగ్‌ స్టాఫ్‌ను కొనసాగించాలనుకోవడం మంచి నిర్ణయం. రాహుల్‌ ద్రవిడ్‌ అందుకు అంగీకరించడం ప్రశంసించదగిన విషయం. టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతుందని ఆశిస్తున్నా. టీ20 ఫార్మాట్‌ చాలా భిన్నమైంది. సవాళ్లతో కూడుకొన్నది.
ఇందులోనూ ద్రవిడ్‌ సహా అతని బందం అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నా. వారందరికీ శుభాకాంక్షలు” అని గంభీర్‌ మీడియాతో చెప్పారు.