– అబివృద్దికి యువత తోడవ్వాలి..మంచి వైపు నిలబడాలి
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ- భీంగల్
బాల్కొండ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను లెక్కపెట్టడానికి కాంగ్రెస్ బిజెపి నాయకులకు మరో ఐదు సంవత్సరాలు పడుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని తండాలు,గ్రామాల్లో సుమారు 40 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపనలు చేశారు. రూప్ల తండాలో రూప్ల తండా నుండి చెంగల్ వరకు బిటి రోడ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన1.80 కోట్లతో, రూప్ల తండా నుండి బడా భీంగల్ రోడ్ రిన్వల్ 56 లక్షలతో, ఎం.జి తండా గ్రామ పంచాయతీ నుండి బడా భీంగల్ బిటి రోడ్ రిన్వల్ 1.40 కోట్లతో శంకుస్థాపన, సికింద్రాపూర్ గ్రామంలో సికింద్రాపూర్ నుండి బెజ్జోరా వరకు బిటి రోడ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన 2.20 కోట్లతో, బెజ్జోరా సికింద్రాపూర్ రోడ్డు కప్పల వాగుపై రోడ్ డ్యామ్ నిర్మాణం 2.60 కోట్లతో, బెజ్జోరా గ్రామంలో బెజ్జోరా నుండి సికింద్రాపూర్ వరకు బిటి రోడ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన 2.20 కోట్లతో, భీంగల్ నుండి తుంపల్లి రోడ్ వయా బెజ్జోరా రోడ్ పనుల శంకుస్థాపన 3.04 కోట్లతో, బెజ్జోరా సికింద్రాపూర్ రోడ్డు కప్పల వాగుపై రోడ్ డ్యామ్ నిర్మాణం 2.60 కోట్లతో, ముచ్కూర్ గ్రామంలో భీంగల్ నుండి తుంపల్లి రోడ్ వయా బెజ్జోరా,ముచ్కూర్ రోడ్ పనుల శంకుస్థాపన 3.04 కోట్లతో,బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ, బాబానగర్ గ్రామంలో నాబార్డ్ గోడౌన్ కాంపౌండ్ వాల్,సిసి ఫ్లాట్ ఫామ్,గోడౌన్ మెయిన్ రోడ్ సిసి గా మార్చుట కొరకు 1.41 కోట్లతో పనుల శంకుస్థాపన, కారేపల్లి గ్రామంలో 1.50 కోట్లతో కారేపల్లి నుండి రహత్ నగర్ రోడ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన, కొత్త తండా లో రహత్ నగర్ రింగ్ రోడ్డు రిన్వల్ వయా కొత్త తండా 95 లక్షలతో, జాగిర్యాల గ్రామంలో మోర్తాడ్ భీంగల్ రోడ్డు 12 నుండి 16/5 వరకు అభివృద్ధి పనుల శంకుస్థాపన 4.30 కోట్ల వ్యయం గల పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో గత నెలలుగా వందల కోట్లతో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతుందని అన్నారు. బుధవారం ఒక్కరోజే సుమారు 40 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. కొంత మంది కేంద్ర నిధులు అని అజ్ఞానంతో అసత్యాలు మాట్లాడుతున్నారని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన టాక్స్ నుంచి తిరిగి కొన్ని నిధులు రాష్ట్రానికి ఇస్తారని అది అన్ని రాష్ట్రాలకు హక్కుగా ఇచ్చేవే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రూ. పన్ను చెల్లిస్తే అభివృద్ది కోసమని 40 రూ. మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి తిరిగి ఇస్తారని ఉదహరించారు. అవి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రపోజల్ పెడతారని,తన విచక్షణాధికారం మేరకు ఏ పనులు పెట్టాలనేది ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే నిర్ణయం ప్రకారం ఉంటుందని వివరించారు. విమర్శించే వారికి అవగాహన లేకుండా మా నిధులే అంటారని,అవి రాష్ట్రానికి హక్కుగా వచ్చే నిధులు అని అప్పనంగా వచ్చినవి కావని, ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని తేల్చి చెప్పారు.
కొంత మంది అభివృద్ధి పై చర్చకు సిద్దమని సవాల్ చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను అభివృద్ది కోసం వేసిన శిలాఫలకాలు లెక్కపెట్టడానికే ప్రతిపక్షాలకు 5ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. శిలాఫలకాలు ఎన్నో నెంబర్ వేసుకుని వస్తె చర్చకు సిద్దమన్నారు. బీజేపీ,కాంగ్రెస్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, యువత వారి మాయ మాటల మత్తులో పడొద్దని సూచించారు. మంచి.. చెడు..అభివృద్ది పై ఆలోచన చేసే శక్తి యువతకుందని,అబివృద్దికి యువత తోడై,మంచి వైపు నిలబడాలన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా,అసత్య ఆరోపణలు చేసినా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ది ఆగదని స్పష్టం చేశారు. మీ అభివృద్ది కోరుకునే మీ బిడ్డను. నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని, మళ్ళీ తనను ఆశీర్వదించాలని మంత్రి వేముల ప్రజలను కోరారు. మంత్రి వెంట హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. మధుశేఖర్, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, జెడ్పిటిసి చౌటుపల్లి రవి ,ఎంపీపీ ఆర్మూర్ మహేష్ ,పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు,మండల పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.