
నవతెలంగాణ- వీణవంక
హుజురాబాద్ కు గుర్తింపు తెచ్చిన ఘనత ఈటల రాజేందర్ దే నని, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్ నగర్, శ్రీరాములపేట, కోర్కల్, కిష్టంపేట, దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో జమున గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా హుజురాబాద్ గుర్తుండేలా ఈటల రాజేందర్ చేశారని గుర్తు చేశారు. ఉద్యమ కాలం నుండి పార్టీని అంటుపెట్టుకుని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజాభిమానంతో రెండు సార్లు మంత్రి పదవి చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవలను గుర్తు చేశారు. కమలం పూవు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, ప్రజాప్రతినిధులు నాయకులు, మాడ గౌతం రెడ్డి, సీహెచ్ నర్సింహరాజు, గాలేటి జ్యోతి సురేందర్ రెడ్డి, మేకల ఎల్లారెడ్డి, బాపురావు, కుమార్, తోట తిరుమల్, పూదరి అనిల్, నానియాదవ్, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.