రాజకీయ లబ్ది కోసమే ఈటల వ్యాఖ్యలు

– చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ చూస్తున్నారని టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీి చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్తున్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆశాలు, ఏఎన్‌ఎంల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. స్వరాష్ట్రంలో ఆశాలు, ఎఎన్‌ఎంలకు ఎలాంటి కష్టాలు, అవమానాలు లేకుండా ప్రభుత్వం కాపాడుతున్నదని తెలిపారు.