మహా జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ పిఓ అంకిత్

– హెల్త్ క్యాంపు, జంపన్న వాగు పరిసరాలను పరిశీలించిన పిఓ
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం మహా జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఏర్పాట్లను గురువారం ఏటూర్ నాగారం ఐటీడీఏ పీవో అంకిత్
పరిశీలించారు. టెలి కాన్ఫరెన్స్ లో సంబధిత సెక్టార్ విభాగాల అధికారులు తెలిపిన ప్రకారం మెడికల్, మత్స్యశాఖ, తో పాటు వివిధ జాతర ఏర్పాట్లను పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మేడారం ఆర్టీసీ బస్సు స్టాప్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి అని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ క్రాంతి కుమార్ కు పీఓ అదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు వున్నాయి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులూ వున్న తనకు తెలియ చేయాలి అని, అధికారులు అంకిత భావంతో పని చేసి, జాతర లో ప్రజలు ఎలాంటి అసౌకర్యం లేకుండ ప్రజల మన్ననలను పొందే విధంగా విధులు నిర్వహించాలన్నారు. మత్స్యశాఖ జంపన్న వాగు భక్తులకు  సూచనలతో కూడిన మద్యం సేవించి ఎవరు కూడా జంపన వాగులోకి దిగకూడదు. ఎవరైనా అతిక్రమించినచో చట్ట పరమైన చర్యలు తీసుకోబడును అనే ఏర్పాటు చేసిన బ్యానర్లను పరిసరించారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పోస్టర్లను పరిశీలించారు. అనంతరం మెడికల్ క్యాంప్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ మేడారం మహా జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఒత్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శించుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఏపీవో వసంతరావు, ఎస్ ఓ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు.