తాడ్వాయి ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఐటిడిపిఓ అంకిత్

నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ను మంగళవారం ఏటూర్ నాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ప్రభుత్వ నుండి విద్యార్థులకు అందే నోట్ పుస్తకాలు, యూనిఫాం దుస్తులు, పాత్రలు పంపిణీ ఎలా చేస్తున్నారు దానిపై ఆరా తీశారు. గత ఏడాది విద్యా సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, సిబ్బంది మరమతులు పై ప్రధానోపాధ్యాయులు పద్మ తో ఆరా తీశారు. కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ మార్గదర్శక ప్రకారం రాత్రి స్టడీ అవర్స్ మెనూ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్సీ వైద్యులు ఆశ్రమం పాఠశాలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. జిసిసి సామాగ్రి ఇంకా అందలేదని తెలపడంతో, రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని పిఓ తెలిపారు. వంటగదిని పరిశీలించారు. వేడి వేడి పౌష్టికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు సంక్షేమం, భద్రత కోసం హాస్టల్ నిర్వాణ యొక్క అన్ని మార్గదర్శకాలు అనుసరించాలని ఆదేశించారు. అనంతరం తరగతి గదులు వసతి గృహాలు అవసరమైన ట్యూబ్లైట్లను వెంటనే అందించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఫోన్ లో ఆదేశించారు. కాంటిజన్స్ వర్కులకు జీతాలు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల టాయిలెట్, వంటగది బ్లాక్ లు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పద్మ, వార్డెన్ మోకాళ్ళ లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.