ముగిసిన ఐటీఎఫ్‌ జాతీయ పోటీలు

ముగిసిన ఐటీఎఫ్‌ జాతీయ పోటీలుహైదరాబాద్‌ : భారత ట్రయథ్లాన్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జాతీయ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, పారా చాంపియన్‌షిప్స్‌ 2024 పోటీలు సోమవారం ముగిశాయి. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోటీల్లో పలు విభాగాల్లో అథ్లెట్లు సత్తా చాటారు. తెలంగాణ అథ్లెట్‌ జొహన షిజు సబ్‌ జూనియర్‌ గర్ల్స్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ట్రయథ్లాన్‌ సంఘం అధ్యక్షుడు మదన్‌ మోహన్‌, ఇతర ఆఫీస్‌బేరర్లు పాల్గొన్నారు.