న్యూఢిల్లీ : నిర్దోషిగా విడుదలైన తాను ఇంకా జైలు గదిలోనే ఉన్నట్లుగా ఉందని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అన్నారు. మావో యిస్టు సంబంధాల కేసులో బాంబే హైకోర్టు ఈ నెల 5న సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 7న సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లా డారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆసుపత్రికి వెళ్లడాని కంటే మీడియాతో మాట్లాడాలనే తాను నిర్ణయించుకున్నానని అన్నారు. తన ఏడేళ్ల జైలు కష్టాల ను సాయిబాబా గుర్తు చేసుకున్నారు. అలాగే గత ఏడేళ్లలో తన కుటుంబం అనుభవించిన కష్టాలపై మా ట్లాడుతూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ‘నా కుటుంబం కళంకం ఎదుర్కొంది. నన్ను ఉగ్రవాది అని అన్నారు’ అని కన్నీళ్లతో చెప్పారు. ‘నేను స్వేచ్ఛగా ఉన్నానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అపఖ్యాతి పాలైన నేను ఇప్పటికీ జైలు గదిలోనే ఉన్నట్లు భావిస్తున్నాను. ఇది నాకు ‘అగ్ని పరీక్ష’ వంటిది. నేను రెండుసార్లు అగ్ని పరీక్షకు వెళ్లాల్సి వచ్చింది’ అని అన్నారు. ఈ కేసులో తన తరుపున పోరాడిన లాయర్లకు కృతజ్ఞతలు తెలు పుతూ, లాయర్లలో ఒకరు ఎటువంటి ఫీజు తీసుకులేద ని చెప్పారు. ‘నాకు మద్దతు ఇచ్చినందుకు ఒక న్యాయ వాది జైలు పాలయ్యారు. మరికొంత మంది లాయర్లను పోలీసు అధికారులు బెదిరించారు’ అని తెలిపారు. తన కుటుంబం గురించి చెబుతూ, వారు కేవలం ఆశతోనే బతికారని అన్నారు. ఈ కేసులో సాయిబా బాను గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు దోషిగా తీర్పు చెప్పడంతో 2017 నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఆయన శిక్ష అనుభవించారు. అంతకు ముందు 2014 నుంచి 2016 వరకూ కూడా జైలు జీవితం గడిపారు. బెయిల్‌పై బయటకు వచ్చారు.