నవతెలంగాణ – కరీంనగర్
నగరం నడి ఒడ్డున ఉన్న సీతారాంపుర్ పరిధిలోని ఐ వి హై పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల చైర్మన్ పసుల మహేష్ గారు, డైరెక్టర్ పసుల జయశ్రీ గారు, కో చైర్మన్ శ్రీ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ కోల మాలతి గారి అధ్యక్షతన జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు గణేష కౌత్వ౦, శివతాండవం భరతనాట్యంతో కార్యక్రమం ముందుకు సాగింది. చైర్మన్ పసుల మహేష్ గారు, కోచెర్మన్ శ్రీపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ పాఠ్య ప్రణాళికను పాఠశాలలో ప్రవేశపెట్టామని దానికి సంబంధించి విద్యార్థులకు ఐవి కేంబ్రిడ్జ్ కరికులం అవార్డ్స్ మరియు బెస్ట్ అటెండెన్స్ అవార్డ్స్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్, మరియు అకాడమిక్ ఎక్సలెంట్ అవార్డ్స్, మరియు మూడు రోజులపాటు జరిగిన స్పోర్ట్స్ ఫియస్తాలో భాగంగా విద్యార్థులు టీం జార్డన్, టీం బోల్ట్, టీం ధోని, టీ మెస్సి జట్లుగా ఏర్పడి క్రికెట్, బాస్కెట్ బాల్, హడల్ గేమ్, మరియు అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడగా గెలుపొందిన వారికి మెడల్స్ ప్రశంసా పత్రాలు మరియు గెలిచిన టీం జార్దన్ కి ట్రోఫీ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోచస్ కి మెడల్స్ ప్రశంసా పత్రాలతో వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ స్పోర్ట్స్ ఫియస్తాలో పాల్గొని ఉత్సాహంగా ఆడడంతో గెలుపొందిన వారికి కూడా మెడల్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి విద్యార్థుల తల్లిదండ్రులు దేశభక్తికి సంబంధించిన పాటలు పాడడం, నృత్యాలు చేయడం పలువురిని ఆకట్టుకుంది .ఈ విధంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులే కాక భారీ ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.