కోల్‌కత కెప్టెన్‌గా అయ్యర్‌

వైస్‌ కెప్టెన్‌గా నితీశ్‌ రానా
కోల్‌కత:
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. గాయంతో గత సీజన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరమవగా.. నితీశ్‌ రానా కెప్టెన్సీ బాధ్యతలు వహించాడు. ఈ ఏడాది శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమంతో తిరిగి అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తూ ప్రాంఛైజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నితీశ్‌ రానా వైస్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఈ మేరకు కోల్‌కత నైట్‌రైడర్స్‌ సీఈవో వెంకీ మైసూర్‌ వెల్లడించారు.