ఈనెల 5 6 తేదీల్లో ఆల్ ఇండియా అఖిలభారత సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశాలు మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో జరిగినటువంటి సమావేశాల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన జబ్బర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబించే కార్మిక, కర్షక విధానాలను ఎండగాడుతూ ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తూన్న నాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవం కావడం సంతోషకరమని ఆయన అన్నారు. అలాగే తనపై కేంద్ర రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు ఇచ్చి నందుకు ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు.