జేఏసీ నేతల నిరసన

JAC leaders protestనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గవర్నర్‌తో చర్చలకు సెలెక్టెడ్‌గా కొన్ని కార్మిక సంఘాల నేతల్నే పిలవడంపై టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్‌ చర్యలకు రమ్మన్నారని తెలిసిన జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్‌ యూనియన్‌), కో కన్వీనర్‌ కత్తుల యాదయ్య (బీకేయూ), జేఏసీ నాయకులు పీ రవీందర్‌రెడ్డి (స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌-ఎస్‌డబ్ల్యూఎఫ్‌) తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. తమ వద్ద ఉన్న లిస్ట్‌లో వారి పేర్లు లేవని బయటే నిలిపేశారు. తాము జేఏసీ ప్రతినిధులమని చెప్పినా లోనికి అనుమతించలేదు. దీనితో పై నాయకులంతా రాజ్‌భవన్‌ గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చర్చల్లో కార్మిక సంఘాల పట్ల వివక్ష తగదని నినాదాలు చేశారు.