నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అధ్యక్షతన ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ని రవీంద్ర భారతి పర్యాటక భవన్ నందు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, పూల మొక్క ను ప్రభుత్వ ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ సమస్యలు, రావలసిన కరువు భత్యాలపై ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, సాంస్కృతిక కళాకారుల సమస్యలపై చర్చించగా, సానుకూలంగా మంత్రులు స్పందించారు. త్వరలో ఉద్యోగుల సమస్యలన్నిoటిని పరిష్కరించుటకు సీఎం సుముకతతో ఉన్నారని, త్వరలో ఉద్యోగ లోకానికి తీపి కబుర్లు ఉంటాయని తెలిపిన అనంతరం రాష్ట్ర సచివాలయం నందు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు అనసూయ సీతక్క ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా ఉద్యోగులు సన్మానించారు. ఉద్యోగుల సమస్యలతోపాటు అంగన్వాడి టీచర్ల సమస్యల్లో భాగంగా పదోన్నతులలో టీచర్లకు వయసు సడలింపు చేయవలసిందిగా, ఇతరత్రా సమస్యలపై వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు. మంత్రివర్యులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినందుకు గాను వారికి ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర శాఖ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరీ శ్రీనివాస్, టీఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ముజీబ్ , ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.