రైతుల దీక్షకు మద్దతుగా జేఏసీ ర్యాలీ

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రైతుల న్యాయపరమైన కోరికలను నెరవేర్చాలని ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు మద్దతుగా హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఐక్య కార్యాచరణ కమిటీ (జెఏసి) నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందుల గురి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారితో చర్చలు జరిపి వారి న్యాయపరమైన కోరికలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో  పిసిసి కార్యదర్శి కేడం లింగమూర్తి ,జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్,  జెఏసి కో కన్వీనర్ ముక్కెర సంపత్ కుమార్, వడ్డేపల్లి మల్లేశం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  బంక చందు, పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.