సఫాయి కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదు.. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసు

నవతెలంగాణ- నవీపేట్: సఫాయి కార్మికుల నిరవధిక సమ్మె డిమాండ్లను పరిష్కరించకుంటే సఫాయి కార్మికుల కోపాగ్నికి కెసిఆర్ ప్రభుత్వం బలి కాక తప్పదని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసు అన్నారు. మండల కేంద్రంలో సఫాయి సిబ్బంది 29 రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా గురువారం హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సఫాయి సిబ్బందికి సలాం అంటూ కరోనా సందర్భంగా కితాబు ఇచ్చారని కేవలం సలాం అంటే సఫాయి సిబ్బంది సమస్యలు పరిష్కారం కావని వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సపాయి కార్మికులను పర్మినెంట్ చేసే విధంగా జీవో జారీ చేయాలని అన్నారు. సమ్మె డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్, పిడిఎస్యు నాయకులు గౌతం, మేకల ఆంజనేయులు, లక్క గంగారం, తులసి రామ్ మరియు కార్మికులు పాల్గొన్నారు.