హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హీరో సిద్ధు జొన్నలగడ్డ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీకొడుకులు నరేష్, సిద్దు మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. ఇక హీరో పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ అసలు హీరో ఏ ఉద్యోగం చేస్తున్నాడు? లక్ష్యం ఏంటి? గమ్యం ఏంటి? ఆ పోరాటాలు ఏంటి? ఈ ప్రేమ కథ ఏంటి? అని ఇలా సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్‌ను కట్ చేశారు. వైష్ణవి చైతన్య, సిద్దు జంట చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. బివిఎస్‌ఎన్ ప్రసాద్ నేతత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.