జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. వైఎస్‌ జగన్‌ కేసులో విచారణ ఆలస్యం అవుతుందని రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని ధర్మాసనం ప్రశ్నించింది.