జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు…

– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామపంచాయతీ కార్యాలయానికి 18 లక్షల రూపాయలతో బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేసి మాట్లాడారు.జగదీశ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు కెసిఆర్ మందు గ్లాసులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్న చరిత్ర నీది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.జగదీష్ రెడ్డి నా గురించి గానీ మంత్రి వెంకట్ రెడ్డి గురించి అవాకులు చవాకులు పేల్చుతున్నాడు.తెలంగాణ రాష్ట్రం రాకముందు నీ ఆస్తి ఎంత? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ ఆస్తి ఎంతనో ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వేలకోట్లను సంపాదించిన ఘనత నీది కాదా అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.నువ్వు ఎవరికి ఏం వరగపెట్టావో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో ప్రతి ఒక్క నాయకుడు వందల కోట్లకు ఎగబాకారని దుయ్యబట్టారు.వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గ్యారేజ్ కు పోవడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పుడే కుదురుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని మరోసారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీలు, సర్పంచులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు