కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడం, ముక్కు సూటిగా ఉండటం…రాజకీయ నాయకుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటివారు ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అప్పుడప్పుడు వారి మాటలే వారికి యమపాశాలౌ తుంటాయి. కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్ రడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి ఆ కోవలోకి వస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన తీరుకు చీవాట్లు తిన్న సందర్భాలెన్నో. తాజాగా గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి (జగ్గన్న) మాట్లాడిన తీరు కూడా ఆయనకే రివర్స్ అయింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైస్‌మిల్లర్ల నుంచి ‘యూ ట్యాక్స్’ (ఉత్తమ్‌ట్యాక్స్) వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శలు గుప్పించారు. దీనిపై పార్టీ తరుపున కౌంటర్ ఇవ్వాలంటూ జగ్గన్నను ఉత్తమ్ పురమాయిం చారు. ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఉత్తమ్ ఆదేశాను సారం ఏలేటిపై జగ్గన్న ఫైర్ అయ్యారు. ఇంతలోనే విలేకర్ల నుంచి జగ్గన్నకు దిమ్మదిరిగే ప్రశ్న దూసు కొచ్చింది. ఆయన కూడా ఉహించి ఉండరు. గతంలో ఏలేటి ‘త్రిబుల్ ఆర్’ ట్యాక్స్, (రేవంత్ రెడ్డి,రాహుల్ ట్యాక్స్) బీ ట్యాక్స్ (భట్టి ట్యాక్స్) అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పుడు మాట్లాడని జగ్గన్న యూ ట్యాక్స్ అనగానే ఆగమేఘాల మీద స్పందిస్తున్నారు.. ఎందుకు? దానికి అనుబంధంగా త్రిబుల్ ట్యాక్స్, బీ ట్యాక్స్ నిజమే కానీ యూ ట్యాక్స్ నిజం కాదని చెప్పదలిచారా? రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ ఉత్తమ్ అలాంటోడు కాదూ.. ఆయనో తెల్లకాగితం వంటి వారనడంలో మీ ఉద్దేశమేంటని మరో బుల్లెట్ లాంటి ప్రశ్న దిగింది. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం ఉత్తమ్‌ను వెనకేసుకొచ్చారు. ‘ఆయన సైన్యంలో పని చేశారు. ఏలేటి మహేశ్వర రెడ్డి వెంటనే ఉత్తమ్‌కు క్షమాపణ చెప్పాలంటూ’ ముగిం చారు. ఎప్పుడు విలేకర్ల సమావేశం నిర్వహి ంచినా అరగంట, గంట మాట్లాడే జగ్గన్న… ఇంత తొందరగా ముగిస్తారను కోలేదు అని మరో విలేకరి ప్రశ్న.. సమాధానం చెప్పకుండానే నవ్వుతూ ప్రెస్ కాన్పరెన్స్ గది నుంచి వెళ్లిపోయారు. దీని వెనకే ముందోనని విలేకర్లు గుసగుసలాడు కున్నారు.
– గుడిగ రఘు