జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కి సన్మానం

నవతెలంగాణ-కంటేశ్వర్
ఖలీల్ వాడి నందుగల రోటరీ సభ్యులు మాజీ అధ్యక్షులు డాక్టర్ పి వి కృష్ణమూర్తి గిరిజ రెటీనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా రోటరీ సభ్యులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్. సంజయ్ కుమార్ ని రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. వారికి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చేస్తున్నటువంటి కృత్రిమ కాలు జైపూర్ ఫ్రూట్ శిబిరం గురించి తెలుపుతూ అనంతరం ఘనంగా వారిని ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సతీష్ షాహ్ , విజయరావు బాబురావు, మంచాల కృష్ణ జ్ఞాన ప్రకాష్, శ్యామగర్వాల్ రాజ్కుమార్ సుబేదార్ ధన్పాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.