
హుస్నాబాద్ ఐఓసి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆర్డిఓ రామ్మూర్తి శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిగ్జీవన్ రామ్ చిత్రపటానికి హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ రుక్మిణి, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.