
దేశమాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎంపీడీవో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆయా కార్యాలయాల సిబ్బంది వీరితో పాటు స్థానిక ఎంపీటీసీ కుటుంబ సభ్యులు రచ్చ కుశాల్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు.