జగజ్యోతికి రిమాండ్‌

జగజ్యోతికి రిమాండ్‌– ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు
నవతెలంగాణ-మెహిదీపట్నం
కాంట్రాక్టర్‌ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగ జ్యోతికి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. రెండ్రోజుల కిందట ఆమెను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తీసుకొని వెళ్తుండగా తనకు గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. దాంతో ఆమెను బుధవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే ఆమెను అరెస్టు చేసిన 24 గంటల లోపల ఎందుకు హాజరు పరచలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఏసీబీ పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ వివరించి దీనికి సం బంధించి కోర్టులో ముందు గానే మెమో దాఖలు చేసినట్టు తెలిపారు. దీంతో న్యాయ మూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం అధికారులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా ఆమె ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు జరిపి స్వాధీనపరుచుకున్న ఆస్తులు, బంగారం మార్కెట్‌ విలువ ప్రకారం రూ.15 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు.