జాగో సబ్‌ లోగోం

ఎందుకండీ ఆచరణకు నోచుకోని
ప్రతిజ్ఞ రోజూ వల్లెవేయిస్తారు బడిలో
అన్నదమ్ములనే బోధన చేస్తుంటారు
కాని దేశంలో భాషలు, జాతులు
భిన్నత్వంలో ఏకత్వం అనేది
ఒక కుహనా భావనే తప్ప నిజంకాదు
ఎందుకో కొంతమంది
పాలకుల పుణ్యమా అని
వాస్తవానికి దానికి విలోమంగా
ఉన్నాయన్నది నగ సత్యం
చెప్పేవి శ్రీరంగనీతులు
దూరేవి…గుడిసెలన్న
చందాన రాజ్యమేలే
కమలనాథుల ప్రభుత్వ పాలనలో
రాజ్యాంగానికి చిల్లులు పెడుతూ
కాలం చెల్లని మనుస్మృతిని
అంటుపెడుతుంటే
లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ
ఉరేసుకోబోతుంటే
స్తోత్రాలు వల్లిస్తూ
గమ్మునుండటం కాదు
అనివార్యంగా పిడికిలి బిగించి
ప్రజాపోరుకు సిద్ధపడాలి…

– కపిల రాంకుమార్‌,
9849535033