భిన్న కథతో ప్రేమకు జై..

Jai for love with a different story..ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై’. గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్‌ మల్లం దర్శకత్వం వహించిన చిత్రమిది. అనిల్‌ బురగాని, ఆర్‌.జ్వలిత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్‌ కనిపించనున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సరంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా లిరిక్‌ రైటర్‌ శివశక్తి దత్త ఈ చిత్ర పోస్టర్‌, టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘యంగ్‌ టాలెంట్‌ బాగా చేశారు. నూతన నటీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్‌తోపాటు టీజర్‌ చాలా బాగుంది’ అని తెలిపారు.
‘వాస్తవ సంఘటనతో రూపొందుతున్న ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. కొత్త సంవత్సరం కానుకగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత అనసూర్య అన్నారు. ‘మంచి కటెంట్‌ ఉన్న కథతో మా నిర్మాత అనసూర్య ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’ అని దర్శకుడు శ్రీనివాస్‌ మల్లం చెప్పారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: మైలారం రాజు, డిఓపి: ఉరుకుందా రెడ్డి, మ్యూజిక్‌ : చైతు, ఎడిటర్‌: సామ్రాట్‌ జి, ఫైట్స్‌: రాబిన్‌ సుబ్బు, డైనమిక్‌ మధు, కొరియోగ్రాఫర్‌ :బాలు.