జై ఇండియా

జై ఇండియా హొబొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియా ఫైల్స్‌’. ఈ సినిమా నుండి ‘జై ఇండియా..’ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో రాజకీయ నేత అద్దంకి దయాకర్‌, సితార, ఇంద్రజ, సుమన్‌, శుభలేఖ సుధాకర్‌, హిమజ, రవి ప్రకాష్‌, జీవన్‌ కుమార్‌ వంటి నటీనటులు నటిస్తుండగా బొమ్మకు క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను బొమ్మకు మురళి స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కార్యనిర్వాక నిర్మాత కనక దుర్గ నాగులపల్లిహొమాట్లాడుతూ, ‘ఈ సాంగ్‌ వింటుంటే గూస్‌బమ్స్‌ వస్తున్నాయి. ఈ సినిమా కథ గద్దర్‌ 70 ఏళ్ల రీసెర్చ్‌. అందరూ నివ్వెర పోయేలా దయాకర్‌ నటించారు. మౌనశ్రీ మల్లిక్‌ చాలా గొప్ప సాహిత్యం అందించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. బొమ్మకు మురళి సమాజ మార్పు కోసం కన్న కల ఈ సినిమా’ అని అన్నారు. ‘మన దేశ సనాతన, ఇతిహాస ధర్మాలలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సినిమాలో తీశారు’ అని హీరో అద్దంకి దయాకర్‌హొచెప్పారు.దర్శక, నిర్మాత బొమ్మకు మురళి మాట్లాడుతూ, ‘గద్దర్‌ ఇచ్చిన కథ ఇది. ఈ సినిమాలో మనిషి మనుగడ గురించి చెప్పా, మనిషి పుట్టుక నుండి ఇప్పటి వరకు మన జీవన విధానంలో జరిగిన మార్పులు, సనాతన ధర్మం మన మధ్య ఎలా నడుస్తుంది, మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది అనేది కథగా చెప్పా. కల్చరల్‌ డిఎన్‌ఏ అనే కాన్సెప్ట్‌తో, చట్టాలు మనల్ని కంట్రోల్‌లో పెట్టేలా ఎలా వచ్చాయి అని ఈ సినిమా కథ’ అని తెలిపారు.