సంతోష్ కల్వచెర్ల, పావని రామిశెట్టి జంటగా, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, నాగినీడు, విజయ రంగ రాజు, అప్పాజీ అంబరీష్, బిహెచ్ ఇఎల్ ప్రసాద్, బలగం సంజరు, బాల పరసార్, సంజన చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన ఇండిపెండెట్ ఫిల్మ్ ‘జై జవాన్’. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కాన్సెప్ట్ నచ్చి, ఈ చిత్ర ట్రైలర్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశాం. సంతోష్ కల్వచెర్ల హీరోగా చక్కని ప్రతిభను కనపరిచాడు’ అని చెప్పారు.