భూమాతను చూశావా
ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో
కోట్ల మంది పిల్లల జీవితాల కోసం
బార్డర్లో బిడ్డల ప్రాణాలు అర్ధంతరంగా,
అర్థం లేకుండా పోతున్నాయని
భూమాతను చూశావా
ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో
అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్చగా తిరిగిన రోజున
స్వాతంత్రం వచ్చినట్టే అన్నారు
కానీ … పసి పాపలని చూడకుండ
చిదిమేసిన రాబందు మూకల ఆకలికి బలాయేనే
భూమాతను చూశావా
ఎలా ఘోషిస్తుందో
చావు కళ్ళముందరే ఉన్న
కంటిపై కునుకు రాకుండా కాపు కాస్తూ ఉంటే
ఒక్కో తూటాకు అమ్మ అనే పిలుపుకు
ఈ భారతమ్మ కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి
భూమాతను చూశావా
ఎలా తల్లడిల్లుతుందో
నిన్ను గన్నది ఆడదన్న సంగతి మరిచి
కామంతో కళ్ళు మూసుకుని
కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉంటే
ఆ కన్నతల్లి కడుపుకోత ఆర్థనాదాలకి…
గడ్డిపోచ కూడా కత్తిపట్టి యుద్ధం చేస్తుందేమో
భూమాతను చూశావా
ఎలా తపించిపోతుందో
దేశానికి వెన్నముక అయిన రైతు
పచ్చని పంట పొలాల మధ్య
పక్షిలా నేల రాలిపోతుంటే
ఎలా ప్రశ్నిస్తుందో చూసావా
తన బిడ్డల త్యాగాలకు విలువెక్కడనీ
ఆడపిల్లకు రక్షనెక్కడని
అన్నం పెట్టే రైతన్నను న్యాయం ఎక్కడని..?
జై జవాన్ జై కిసాన్
(15న ఆర్మీ దినోత్సవం సందర్భంగా)
– యం.మమత