టాప్‌-10లో జైస్వాల్‌కు చోటు

టాప్‌-10లో జైస్వాల్‌కు చోటు– రోహిత్‌, కోహ్లి కూడా..
– ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టెస్ట్‌ బ్యాటర్ల జాబితాలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌తోపాటు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా ఉన్నారు. ఐసిసి బుధవారం ప్రకటించిన జాబితాలో వీరు ముగ్గురూ టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఇక ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య టెస్ట్‌ సిరీస్‌ ముగియడంతో తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ను ఐసిసి విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ మరోసారి టాప్‌లో నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను అధిగమించి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ ఇటీవలికాలంలో ఒక్క టెస్ట్‌కూడా ఆడకుండానే టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో జో రూట్‌ 872 రేటింగ్‌ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. కేన్‌ విలియమ్సన్‌(859) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ(751) 6వ ర్యాంక్‌, జైస్వాల్‌(740) 8వ ర్యాంక్‌, కోహ్లి(747) 10వ ర్యాంక్‌లో ఉన్నారు.. ఈ జాబితాలో యువ ఆటగాడు జైస్వాల్‌ ర్యాంకింగ్‌ కోహ్లీ కంటే ముందు ఉండటం విశేషం.
తాజా టాప్‌ 10 బ్యాటర్స్‌..
1. జో రూట్‌ (ఇంగ్లాండ్‌-872పాయింట్లు)
2. కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌- 859పాయింట్లు)
3. బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌ – 768పాయింట్లు)
4. డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌ – 768పాయింట్లు)
5. స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా – 757పాయింట్లు)
6. రోహిత్‌ శర్మ (ఇండియా – 751పాయింట్లు)
7. హ్యారీ బ్రూక్‌ (ఇంగ్లాండ్‌ – 749పాయింట్లు)
8. యశస్వి జైస్వాల్‌ (ఇండియా – 740పాయింట్లు)
9. దిముత్‌ కరుణరత్నే (శ్రీలంక – 739పాయింట్లు)
10. విరాట్‌ కోహ్లీ (ఇండియా – 737పాయింట్లు)