జకో..17వ సారి

– ప్రీ క్వార్టర్స్‌లో సెర్బియా స్టార్‌
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
పారిస్‌ (ఫ్రాన్స్‌) : సెర్బియా యోధుడు, మూడో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 17వ సారి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ నాల్గో రౌండ్లో నొవాక్‌ జకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో వరుస సెట్లలో జువాన్‌ పాబ్లో వారిలాస్‌ (పెరు)పై అలవోక విజయం సాధించాడు. ఏడు ఏస్‌లతో మెరిసిన జకోవిచ్‌.. మూడు డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడినా ప్రత్యర్థికి ఒక్క సెట్‌ కోల్పోలేదు.