ఎమ్మెల్యేను సన్మానించిన జక్రన్ పల్లి ఎస్సీ మాదిగ సంఘం

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ మాదిగ సంఘం సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని శాలువాతో పూల బొకేను అందజేస్తూ సన్మానించారు. ఎస్సీ మాదిగ సభ్యులూ మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి ఎమ్మెల్యేని సన్మానించి సంఘ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాట్ పల్లి నర్సారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొప్పరి వినోద్ సంగ సభ్యులు నట్టశాలు, పైడి మహేందర్, బండారి గంగాధర్, గోట్టు ముక్కుల బుజ్జీ,  సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.