బస్సులో పోయిన సెల్ ఫోను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జక్రాన్ పల్లి పోలీసులు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

బస్సులో పోయిన సెల్ ఫోను రికవరీ చేసి బాధితులకు జక్రాన్ పల్లి పోలీసులు అందజేశారు. మండలంలోని కొలిప్యాక్ గ్రామానికి చెందిన బద్దం రమ్య ఈనెల మూడవ తేదీన బస్సులో ప్రయాణిస్తుండగా సెల్ఫోను పోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ లో వివరాలు ఎంట్రీ చేసి విచారణ చేపట్టగా గురువారం బాధితురాలకు సంబంధించిన సెల్ ఫోన్ ఇతరులు వాడుతున్నట్టు తెలుసుకొని వారి నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.