వర్షాలకోసం జలాభిషేకం..

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ గ్రామంలోసోమవారంరోజున పాప హరేశ్వరఆలయంలో వర్షాలుకురవాలని శివాలయంలో శివునికి ప్రత్యేకపూజలు నిర్వహించి1100 బిందెలతో శివలింగానికి జలాభిషేకం చేశారు. రెండు నెలలుగా వర్షాలజాడ లేక పంటలుఎండిముఖంపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో దేవుడు కరుణించివర్షాలు కురిపించాలనిప్రత్యేక పూజలునిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామ పురోహితుడు బాబన్న పంతులు,సర్పంచ్ తిరుమలరెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.