మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగ జలాభిషేకం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన విడుల గుండా గంగ జలాన్ని ఊరేగింపు తీసుక వచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. వర్షాలు సవృద్దిగా కురవాలని, పడి పంటలు పండాలని, పశు, పక్షులు, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అద్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు ఉరెడి నరేష్, అనిల్, మాజీ సర్పంచ్ రాజేందర్, గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.