నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి రక్తదాతల సమూహం 2025 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎండి జమీల్ హైమద్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ లను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా జమీల్ హైమద్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని అందజేసిన సంస్థకు పని చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాల నిర్వహించి తలసేమియా చిన్నారుల కోసం, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం కోసం పనిచేస్తామన్నారు. 2025 సంవత్సరానికి గాను అధ్యక్షలు జమీల్ హైమద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, నిర్వాహకులుగా డాక్టర్ బాలు, గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ వేద ప్రకాష్, ఉపాధ్యక్షులుగా గంప ప్రసాద్, వెంకట రమణ, సలహాదారులుగా ఎర్రం చంద్రశేఖర్ లు కొనసాగడం జరుగుతుందని పేర్కొన్నారు.