ప్రచారంలో జోరు పెంచిన జానారెడ్డి

– జయవీర్ గెలువు ముమ్మరంగా ప్రచారం
నవతెలంగాణ -పెద్దవూర : నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రచారం లో జానరెడ్డి జోరు పెంచారు.జయవీర్ గెలుపు ఖాయం అయినప్పటికీ భారీ మెజార్టీ కోసం కృషి చేస్తున్నా రు.అందులో బాగంగా శుక్రవారం ప మండల కేంద్రం లో చలకుర్తి,పెద్దవూర మండల కేంద్రం లో మాజీ మంత్రి జానారెడ్డి ఎన్నికల ప్రచారం లో మాట్లాడారు. సాగర్ ఎడమ కాలువ పైన 46 లిఫ్ట్ లు ఏర్పాటు చేసి 2లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పతకం లో నియోజకవర్గం 35 వేల ఇండ్లు కట్టించామని అన్నారు. దళితులకు 3 ఎకరాలు భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, విద్య, ఉద్యోగాలు కల్పించడం లో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు ఈసారి జయవీర్ గెలిపించి సోనియా గాంధీ కిగిఫ్ట్ గా ఇవ్వాలని ప్రచార హోరు పెంచారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకే సారి 2,00,000 రుణ మాఫీ,500 రూపాయలకే గ్యాస్ సిలెండర్,బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి తొమ్మిది రకాల రేషన్ సరుకులు,ప్రతి నెల 2500 లు అకౌంట్ లో వేస్తున్నామన్నారు.నిరుద్యోగులకు 2,00,000 ఉద్యోగాలు,ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్క రికి 5,00,000 లు ఇస్తామన్నారు.రేషన్ కార్డు వున్న ప్రతి మహిళకు ప్రతి నెల 2500 లు
వేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా జయవీర్ గారు మాట్లాడుతూ అనుముల గ్రామం మా సొంత గ్రామం, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే, ఈ గ్రామానికి ఇది చేస్తా అని చెప్పను, చేయడం నా బాధ్యత, అలాగే నాగార్జున నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తా అని, అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీటిసి రామావత్ శంకర్ నాయక్,సర్పంచ్ తుమ్మల పల్లి లలిత వెంకట్ రెడ్డి,ఎంపీటిసి గోదాల నారాయణ రెడ్డి,మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి,జిల్లా నాయకులు గడ్డం పల్లి వినయ్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిలారి మురళీకృష్ణ, పగడాల నాగరాజు,