
హాలియా నూతన సీఐగా జనార్దన్ గౌడ్ నియమితులయ్యారు. శనివారం బాధ్యతలను చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన రాఘవరావు నల్గొండ ఎస్ బి కి బదిలీ అయ్యారు. ఎస్సై సతీష్ రెడ్డి, స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన అన్నారు.