
నవతెలంగాణ- మద్నూర్
ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి కుమారుని పెళ్లి వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు జానారెడ్డి గారిని అలాగే చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని ఎమ్మెల్యే కలిశారు. జుక్కల్ శాసన సభ్యునిగా గెలుపొందిన తోట లక్ష్మీకాంతరావు ప్రతి ఒక్కరిని కలిసి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తున్నారు.