
గ్రామపంచాయతీ కార్మికులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ వెల్తూరి నగేష్ అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 28వ రోజుకు చేరగా జనసేన నాయకులు జిపి సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ జీపీ కార్మికులకు తాత్కాలికంగా రూ.19వేలు వేతనంగా చెల్లించాలని అన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, 2011 జనాభా ప్రాతి పదికన కార్మికులను నియమించాలని డిమాండ్ వ్యాఖ్యానించారు. జిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని లేనియెడల నిరసనకార్యకర్తలు చేపడతామని తెలిపారు. ఈ సమ్మెలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గూడెల్లి ఉప్పలయ్య, మండల అధ్యక్షులడు లక్ష్మణ్, ఉపేందర్, జనసేన తొర్రూర్ మండల్ డివిజన్ అధ్యక్షులు పల్లెర్ల రమేష్, ఉపాధ్యక్షుడు జలకం శివ, గట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.