శిబిరంకు ఆదరణ
నవతెలంగాణ-సిద్దిపేట
వేసవి సెలవులలో విద్యార్థులకు సజన త్మాకతను, శాస్త్రియ దక్పదాన్ని, పెంపోం దింపచేయడానికి, వారు ఉత్సాహంగా ఉండడానికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వారు నిర్వహిస్తున్న శిబిరానికి విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నెల 22 నుంచి 27 వరకు స్థానిక ఇందిరా నగర్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ శిక్షణ శిబిరంలో నేర్పిస్తున్న అంశాలను శాస్త్రీయ దక్పథంతో నేర్చుకుంటుున్నారు.
నేర్పిస్తున్న అంశాలు
జన విజ్ఞాన వేదిక తన సంస్థ ద్వారా శాస్త్రీయ దక్పథాన్ని ప్రజలలో, విద్యార్థుల్లో పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వేసవి కాల సెలవులను ఉపయుక్తంగా చేసుకోవడం కోసం విద్యార్థులకు సజనత్మాకతను, శాస్త్రియ దక్పదాన్ని, పెంపోందింపచేయడానికి మొదటి రెండు రోజులు ఒరిగామి, మూడవరోజు లోకస్ట్ నోకాస్ట్ పాఠ్య పుస్తక ప్రయోగాలు, నాలుగవరోజు మేజిక్, ఐదవరోజు డ్రాయింగ్, బయాలజీ ప్రయోగాలు, ఆరవ రోజు భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగాలు విద్యార్థులకు నేర్పించనున్నారు.
శిక్షణ ఎంతో ఉపయోగకరం
మొలుగు బాలరాజు , జేవివి జిల్లా అధ్యక్షులు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. విద్యార్థుల సజనాత్మకత శక్తిని పెంచే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. మూఢనమ్మకాలను కాకుండా శాస్త్రీయ పదాన్ని నమ్మే విధంగా మ్యాజిక్ షోలు నిర్వహించాం. విద్యాశాఖ అధికారుల సహకారం ఉంది.