నవతెలంగాణ-ధర్మసాగర్
జంగా రాఘవరెడ్డి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. బుధవారం టేకులగూడెం గ్రామంలోని తన గెస్ట్ హౌస్ తోటలో కాంగ్రెస్ కార్యకర్తల, అభిమానుల, నవతెలంగాణ బృంద సభ్యుల మధ్యన ఘనంగా ఆయన వివాహ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని అధ్యక్ష కార్యదర్శులు, డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులు కార్పొరేటర్లు, నవతెలంగాణ బృందల మధ్య పుష్పగుచ్చాలతో శాలువాలతో జంగా సుజాత రాఘవరెడ్డి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇరువురు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. కార్యక్రమంలో నవ తెలంగాణ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ సదిరం ప్రశాంత్ కుమార్, రిపోర్టర్లు రమేష్, దామెర వెంకటేష్, బస్కే అచ్యుత్, శ్యాంసుందర్, మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, నాయకులు కొట్టే చార్లెస్, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు, వివిధ వ్యాపారవేత్తలు, అభిమానులు, వరంగల్ పశ్చిమ మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, గ్రూపు అధ్యక్షులు, సంఘ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.