– కోలాహలంగా మారిన పరిశ్రమల భవన్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ పరిశ్రమల భవన్లో అట్టహాసంగా అభిమానుల హర్షాతిరేకాలు మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయిల్ ఫెడ్ ఎం.డి ఎస్.యాస్మిన్ బాషా,జిఎం సుధాకర్ రెడ్డి లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్ లు జంగా రాఘవ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు.దీంతో పరిశ్రమల భవన్ కోలాహలంగా మారింది.ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా జిల్లాలోని రైతులందరికీ న్యాయం చేశానని,అదేవిధంగా బ్యాంకు అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు.కార్పొరేషన్ పదవిని సైతం అందరికీ ఉపయోగపడేలా చేస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.తమ శాఖ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు.ఈ విధంగా రైతులకు సేవచేసే అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ తిరుమలేష్ రెడ్డి,జున్ను సత్యనారాయణ,శ్రీకాంత్ రెడ్డి,బాలక్రిష్ణ,నాగబాబు,కళ్యాణ్ గౌడ్ లు పాల్గొన్నారు.